కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది రైతు భరోసా.. అందుకే రైతులంతా కులాసా
అక్షర విజేత తాండూరు
సరైన సమయంలో సాగు పెట్టుబడి సాయం అందించడంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని బషీరాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి,మాధవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో కనీ, వినీ ,ఎరగని రీతిలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు.ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించిందన్నారు.ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని చాటి చెప్పిందన్నారు. పథకాలు అమలల్లో భాగంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయించిన అతిరథ మహారాజులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన బండారు ధన్యవాదాలు తెలియజేశారు