కిరణ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
అక్షరవిజేత, హైదరాబాద్ బ్యూరో:
సీనియర్ నాయకుడు, పద్మావతి టైల్స్ షాప్ యజమాని కిరణ్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కిరణ్ కుమార్ గౌడ్ ని శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి ఎంక్లేవ్ అధ్యక్షుడు సిద్ధిరాం రెడ్డి, లింగన్న, మధుకర్ రెడ్డి, ప్రమోద్ కుమార్, దీపక్ రెడ్డి, మహేష్ శర్మ, సంతోష్ శర్మ, రత్నాకర్ రెడ్డి, వెంకటేష్, చందులాల్ తదితరులు పాల్గొని కిరణ్ కుమార్ గౌడ్ కి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.