డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరిట పైసల వసూలు దందా..
అక్షరవిజేత,కమలాపూర్ :
కమలాపూర్ మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు డబల్ బెడ్రూంల నిర్మాణంపై వాటిని పంపిణీ పై నిన్న చేసిన సిపిఐ కార్యకర్తల ధర్నాకు సంబంధించి నిరుపేదల నుండి గత రెండు సంవత్సరాలుగా పైసలు వసూలు చేస్తూ వారికి డబల్ బెడ్రూంలు ఇస్తామని మభ్యపెడుతూ వాళ్ళ పబ్బం గడుపుతు. దాదాపుగా 300 మంది పేదల వద్ద దాదాపు పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు మా దృష్టికి రావడం జరిగినది సిపిఐ నాయకులను తాము ఇచ్చిన పైసలు ఇవ్వమంటూ అడుగుతే రేపు మాపు అంటూ ధర్నాలు చేస్తూ మళ్ళీ పైసలు వసూలు చేయడం జరుగుతుంది అధికారులు దీనిని సీరియస్ గా తీసుకొని నిరుపేదల వద్ద తీసుకున్న పైసలను వెంటనే ఇప్పించాలని కమలాపూర్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలల్లో నిరుపేద కుటుంబాలకు ఇప్పటికే డబల్ బెడ్రూంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే ఖాళీ స్థలాలు లేని వారికి డబల్ బెడ్ రూమ్లలో ఇవ్వడానికి అధికారులు లిస్టు రెడీ చేయడం జరుగుతుంది కావున లబ్ధిదారులు ఎవరికి కూడా అమౌంట్ గానీ లంచాలు గానీ ఇవ్వవద్దని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్ . అసెంబ్లీ కార్యదర్శి ఆడేపు శ్రీకాంత్. మండల వైస్ ప్రెసిడెంట్ చేరాలా రోహిత్. ప్రధాన కార్యదర్శి గాలిబ్ నవీన్. కార్యదర్శి మొగిలిచర్ల శ్రీనివాస్. ఎన్ ఎస్ యు ఐ నాయకుడు వైనాల వంశీ .సత్యపాల్. మరియు బాధితులు పాల్గొనడం జరిగినది..