అందరికీ ఆదర్శప్రాయుడు వీరానందం వార్డెన్
పదవి విరమణ చేసిన వార్డెన్ ను సత్కరించిన సిబ్బంది, మిత్రులు
అక్షర విజేత,తాండూరు
గత 42 సంవత్సరాలుగా తన ఉద్యోగ ధర్మాన్ని సుదీర్ఘవంతంగా నిర్వహిస్తూ తోటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచి రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన వికారాబాద్ జిల్లా తాండూరు బిసి బాలుర హాస్టల్ వార్డెన్ వీరానందం(ఏ ఎస్ డబ్ల్యూ)సోమవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు,మెట్రిన్లు ఆయన మిత్రులు, బంధువులు ఘనంగా సత్కరించారు. బిసి సంక్షేమ శాఖ అధికారుల సిబ్బందితోపాటు ఆయన మిత్రులు ఎస్, సుధాకర్ మెకానిక్, చందర్ ముదిరాజ్, పాపయ్య, రాములు, కె కృష్ణ ఎంసిటి, అంజయ్య, వడ్ల శ్రీనివాస్ ఎల్ఐసి, వడ్ల సత్యనారాయణ, పి సత్యం ఎలక్ట్రిషన్, శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. సంక్షేమ హాస్టల్లో వార్డెన్ గా, అధికారిగా విధి నిర్వహణలో చిత్తశుద్ధితో వీరానందం పని చేశారని కొనియాడారు.