దుద్దిల్ల శ్రీను బాబుకి కృతజ్ఞతలు తెలిపిన విష్ణుదాసు వంశీధర్ రావు*
అక్షరవిజేత,కమలాపూర్:
తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ళ శ్రీను బాబు నూతనంగా టీపీసీసి సెక్రెటరీ గా నియమితులైన సందర్భంగా హన్మకొండ రాంనగర్ భువనేశ్వరి దేవాలయం కి విచ్చేసిన సందర్బంగా మోత్కూరి రాము మరియు విష్ణుదాసు వంశీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు ని హుజురాబాద్ నియోజకవర్గ మాజీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విష్ణుదాసు వంశీధర్ రావు మరియు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మోత్కురి రాము దుద్దిళ్ల శ్రీను బాబు కి సన్మానించడం జరిగింది.అనంతరం నూతనంగా భద్రకాళి ట్రస్ట్ బోర్డ్ మేంబర్ గా నియమితులైన మోత్కురి మయూరి రాముని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మాజీ జనరల్ సెక్రటరీ టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర పీఆర్ఓ విష్ణుదాసు వంశీధర్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ శర్మ,ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉదయమర్రి కృష్ణ మూర్తి,జిల్లా మహిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు బంక సరళ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపాత్ యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మ రెడ్డి,52 డివిజన్ అధ్యక్షుడు తడుక సుమాన్ టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ మహిళ అధ్యక్షురాలు దేవులపల్లి వాణి,దేవులపల్లి హరిహారన్,పండితులు బ్రాహ్మణపల్లి మధు శర్మ,శంకర్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.