కాప్రా ఎమ్మార్వో కార్యాలయంలో ప్రైవేట్ దళారుల హవా..?*
కాప్రా ఎమ్మార్వో కార్యాలయంలో ప్రైవేట్ దళారుల హవా..?
– జవహర్ నగర్ ప్రజలు ఆవేదన
– తక్షణ చర్యల కోసం మేడ్చల్ కలెక్టర్‌ను కోరుతున్న ఉద్యమ కారులు..
* అక్షర విజేత,కాప్రా *:
మేడ్చల్ జిల్లాలోని కాప్రా ఎమ్మార్వో కార్యాలయం ఇప్పుడు అవినీతి మాఫియాకు కేంద్రంగా మారిందని జవహర్ నగర్ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది. *"రెవెన్యూ శాఖలో మా బంధువు ఉన్నాడు, కలెక్టరేట్లో మా లింకులు ఉన్నాయి" అంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు — అంటే అధికారిక హోదా లేని దళారులు — రెవెన్యూ శాఖ అధికారుల పేరుతో ముఠా రూపంలో అవినీతి వసూళ్లకు తెరలేపినట్టు ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.జవహర్ నగర్లో గృహ నిర్మాణాలు చేపడుతున్నవారి నుండి లక్షల రూపాయల లంచాలను ఈ మధ్యవర్తులు వసూలు చేస్తున్నారని సమాచారం. రెవెన్యూ శాఖ అధికారులపై తమ "కంట్రోల్" ఉందంటూ బెదిరింపులకు దిగుతున్న ఈ దళారులు — చట్టాన్ని వెక్కిరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని అపహాస్యం చేస్తూ — ప్రజల నమ్మకాన్ని దూరం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.ఒకవైపు, ఇటీవల కాప్రా ఆర్ఐ అవినీతి కేసు వెలుగులోకి వచ్చి కలకలం రేపగా, ఇదే నేపథ్యంలో ఎమ్మార్వో కార్యాలయం లోపల కూర్చున్న కొన్ని ప్రైవేట్ వ్యక్తుల పేర్లు బయటపడ్డాయి. వీరు నియంత్రణ లేకుండా కార్యాలయం లోకి ప్రవేశించి, అధికారులను కలవాలంటే తమ అనుమతి తప్పనిసరిగా చేస్తూ, లంచాల ఆధారంగా వ్యవహారాలు జరుపుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.అధికారిక హోదా లేని ఒక వ్యక్తి — ప్రెస్ మీట్ల సమయంలో ఎమ్మార్వో పక్కన జేబులో చేతులు పెట్టుకొని అధికారుల్లా నిలబడుతున్నాడు. కార్యాలయపు వ్యవస్థను తమ ఆధీనంలో ఉంచుకున్నట్టుగా ప్రవర్తిస్తున్న అతను, ఎమ్మార్వో క్యాబిన్ బయటి తలుపు వద్దే వున్నాడు. ఎవరైనా లోపలికి రావాలంటే అతని అనుమతి తీసుకోవాల్సిందే. తలుపు తీయడం, భేటీకిఅనుమతించడమంతా అతని ఇష్టానుసారంగా జరుగుతుండటం ఆ అధికార విభాగంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలకు దారి తీస్తోంది.ఇవే జవహర్ నగర్లో అక్రమ భూ దందాలు, సెటిల్మెంట్లకు ప్రేరణగా మారిన దళారులు.ఈ వ్యవహారం మూలంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన పాలన పరిపాలన పద్ధతులు, కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయత ప్రజల్లో పతనమవుతున్నట్టే కనిపిస్తోంది.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరిచిన ఈ వ్యవస్థలో, వాడు తనకు బ్రతుకును ఇచ్చిన స్నేహితుడిని విశమిచ్చి చంపాడట అన్నట్టు — ఒకనాడు నమ్మకాన్ని పొందిన వ్యక్తే నేడు మోసం చేస్తున్న వైనం జవహర్ నగర్ప్రజలనుకలచివేస్తోంది.ప్రజల డిమాండ్:కాప్రా ఎమ్మార్వో కార్యాలయంలో ప్రవేశిస్తున్న ప్రైవేట్ దళారులను తక్షణమే నిషేధించాలి. లంచాల వసూళ్లలో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాప్రా ఎమ్మార్వో కార్యాలయ నిర్వహణపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు లభించాల్సిన సేవలు, మధ్యవర్తుల ద్వారా కాకుండా, నేరుగా అధికారుల నుంచే పొందేలా పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలి.ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయానికి ఓ పరీక్ష సమయం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత అధికారులపై ఉంది.పోలీసుఅధికారులు,ఇంటలిజన్స్, ఏసీబీ అధికారులు ద్రుష్టి సారించాలి.