టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసీ గ్రూప్ ఏర్పాటు చేయాలి*
టేక్మాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపిసీ గ్రూప్ ఏర్పాటు చేయాలి
– బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమ్మరి సిద్దిరాములు
అక్షరవిజేత,టేక్మాల్ :
టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ (మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కుమ్మరి సిద్దిరాములు డిమాండ్ చేశారు.ఇది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం వేయగల కీలక అడుగుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం కళాశాలలో కొన్ని గ్రూపులు మాత్రమే అందుబాటులో ఉండటంతో సైన్స్ గ్రూప్ అభ్యసించదలచిన విద్యార్థులు కష్టాల్లో పడుతున్నారు. తల్లిదండ్రులు ఖర్చులు భరించలేక అనేక మంది విద్యార్థులు అభ్యాసం మానేస్తున్నారు.అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎంపీసీ గ్రూప్‌ను ప్రారంభించాలని, అవసరమైన లెక్చరర్లు, సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఇది విద్యా రంగంలో ముందడుగు కావాలని, నియోజకవర్గానికి చెందిన ప్రతీ విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.