క్షయపై అందరు అవగాహన పెంచుకోవాలి పూడూర్ గల్లీ సబ్ సెంటర్ టీబీ ముక్త్ భారత్ పై అవగాహన
క్షయపై అందరు అవగాహన పెంచుకోవాలి
– పూడూర్ గల్లీ సబ్ సెంటర్ టీబీ ముక్త్ భారత్ పై అవగాహన
అక్షర విజేత, తాండూరు
క్షయ వ్యాధిపై అందరు అవగాహనపెంచుకోవాలని, పల్లె దావఖన డాక్టర్, రాధా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలో పూడూరు గల్లీ సబ్ సెంటర్లో క్షయ వ్యాధి, లక్షణాలపై అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి కళ్ల పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్, గిరిధర్ మాట్లాడుతూ ఎవరైనా వ్యాధి బారిన పడితే ఆందోళన చెందొద్దన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం ఆసుపత్రిల ద్వారా 6నెలలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందన్నారు. వ్యాధి నియంత్రణకు అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు సంపూర్ణ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ పరీక్షలు జరిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, గిరిధర్, డాక్టర్, రాధా ఏఎన్ఎం జయలక్ష్మి, వైదేవి, సంపూర్ణ ప్రతినిధులు భాగ్యలక్ష్మి అరుణ, హర్షవర్దన్ రెడ్డి, ఆశ వర్కర్స్ యాదమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.