ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐ.పి.ఎస్
బాల కార్మిక వ్యవస్థ మానవ అక్రమ రవాణా నిర్మూలనకు జిల్లాలో రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి:-
బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ ఐ.పి.ఎస్ జిల్లా పోలీస్ అధికారులకు ఆదేశించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని రక్షించి పునరావాసం కల్పించి సమస్యను పరిష్కరించడం వంటి లక్ష్యంతో కలిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాలని పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు.ఈ ఆపరేషన్ ముస్కాన్ ఎఎస్పీ చిత్తరంజన్ ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని, 2 ఎస్.ఐ లు 2 హెడ్ కానిస్టేబుల్స్ 4 కానిస్టేబుల్స్ 2 మహిళ కానిస్టేబుల్స్ మొత్తం 10 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు ఈ ప్రత్యేక బృందాలు విద్యాశాఖ,కార్మిక శాఖ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖ ఇతర సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు హోటల్స్ వ్యాపార సముదాయాలు గోదాములు గోదాములు మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని సూచించారు.పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేర్హోమ్కు తరలించే ప్రక్రియను దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.