కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు- జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్
*ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు సభలు ర్యాలీలు నిషేధం*
*జులై 01 వ తేదీ నుంచి జులై 31 వ తేది వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్*
అక్షరవిజేత,అదిలాబాద్ ప్రతినిధి:
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి జులై 01 వ తేదీ నుండి జులై 31వ తేది వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం రోజు ఒక ప్రకటన లో తెలిపారు 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి/ఎఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు ధర్నాలు బహిరంగ సభలు తదితర ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు.నిషేధిత ఆయుధాలు దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కల్గిఉండరాదని తెలిపారు.ప్రజా జనజీవనానికి ఇబ్బంది చిరాకు కల్గించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు.చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు