ఘనంగా శివపార్వతుల కళ్యాణం
విజేత దేవరకద్ర : దేవరకద్ర మండల కేంద్రంలోని శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని గుడి బాయ్ దగ్గర ఉన్న శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం ఆలయంలో పూజారి సంజీవ చారి మహా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకం అలంకరణ వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయవరణంలో సన్నాయి మేళాలతో భక్తుల సందడితో శివపార్వతుల కళ్యాణం. ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తూ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ భక్తులు పాల్గొనే మొక్కులు తీర్చుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.