సెయింట్ అన్నేస్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే ధర్నా
అక్షరవిజేత,కాప్రా :
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ సెంట్ అన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.పారిశ్రామిక ప్రాంతంలో సెంటు అన్నస్ ను సెంట్ అన్స్ గా బోర్డు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ మంగళవారం వివిధ సంఘాలు మహా ధర్నా నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూలు గుర్తింపును రద్దు చేయాలని, డీఈఓ ఎంఈఓ లను సస్పెండ్ చేయాలని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి భాపిరెడ్డి స్కూను సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.