వికసిత్ భారత్ రచ్చబండ కార్య క్రమాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు
అక్షరవిజేత,ఇల్లంతకుంట:
నరేంద్ర మోడీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా సంకల్పంతో సాకారం లో భాగంగా పోత్తూరు, కందికట్కూర్, వల్లంపట్ల, రహీంఖాన్ పేట,ఇల్లంతకుంట, ముస్కాన్ పేట,గాలిపెల్లి, శక్తి కేంద్రలలో రచ్చబండ కార్యక్రమాల ను నిర్వహించడం జరిగింది,ఈ సందర్భంగా అడిచెర్ల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం అయిందని, అలాంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రజలకు తెలియజేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్తిని సాయ గౌడ్ , అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి, జిల్లా నాయకురాలు కొలనూరు ముత్తవ్వ,మండల నాయకులు గుంటి మహేష్, చిమ్మనగొట్టు శ్రీనివాస్, కర్ల లక్ష్మణ్, జట్టి హరికృష్ణ,భూత్ అధ్యక్షులు చక్రాల కార్తీక్,చక్రాల రమేష్, చదువాల శ్రీధర్,తుమ్మనపల్లి కమలాకర్ రావు,తాళ్లపల్లి కిషన్, పిల్లి గోపాల్,గుంటి వేణు,దూది సుదీర్ బత్తిని,ప్రశాంత్, క్రియాశీల సభ్యులు పినికాసి అనిల్,బూత్ కార్యదర్శి భూమల్ల తిరుపతి, భూమల్ల ప్రశాంత్,గజ్జల రమేష్, చెక్కిల ప్రభాకర్, పాల్గొన్నారు.