డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ కళాజాత
అక్షరవిజేత,గరిడేపల్లి :
మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మంగళవారం కలమలచెరువు రోడ్డు చౌరస్తా లో ఎస్ ఐ చలికంటి నరేష్ ప్రజలకు డ్రగ్స్ నివారణపై గరిడేపల్లి పోలీసు సిబ్బంది పోలీసు కళాబృందం తో అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ చలికంటి నరేష్ మాట్లాడుతూ మన పిల్లలు మన యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేలా చూడాలని ఎవరైనా ఇలాంటి వాటికి అలవాటు పడితే తక్షణం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. మన గ్రామాలను డ్రగ్స్ రహిత గంజాయి రహిత గ్రామాలుగా మార్చుకోవాలని కోరారు. డ్రగ్స్ వినియోగించడం వల్ల యువశక్తి నిర్వీర్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ ఎస్ ఐ జగన్, జబర్దస్త్ ఫేమ్ కళాకారుడు కర్తానందం హెడ్ కానిస్టేబుల్స్ లక్ష్మీ నరసయ్య, అక్బర్, కానిస్టేబుల్ ప్రశాంత్, అవినాష్, కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య సభ్యులు గోపయ్య కృష్ణ ఈశ్వర చారి గురులింగం పాల్గొన్నారు