అక్రమ షెడ్లకు అడ్డాగా గగన్ పహాడ్.. గతంలో నోటిస్ ఇచ్చి చేతులు దులుపుకున్న జిహెచ్ఎంసి అధికారులు
అక్రమ షెడ్ల వైపు కన్నెత్తి చూడని జిహెచ్ఎంసి అధికారులు*
– యదేచ్ఛగా అక్రమంగా షెడ్ల నిర్మాణం
– పలు పత్రికల్లో వచ్చిన పట్టించుకోని జిహెచ్ఎంసి అధికారులు*
– అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు
– తక్షణమే అక్రమ షెడ్లను తొలగించాలని స్థానిక ప్రజల డిమాండ్*
అక్షరవిజేత,రాజేంద్రనగర్ :
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాల షెడ్డులు విచ్చలవిడిగా కొనసాగుతున్న జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ షెడ్లకు జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు ఇచ్చిన సదరు వ్యక్తులు స్పందించకుండా చకచకా షెడ్ల నిర్మాణాలు చేపడుతూ అధికారులకు సవాలు వినురుతున్న వైనం ఇప్పటికైనా అధికారులు అక్రమ షెడ్ల నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల కే సవాల్ విసురుతూ అధికారుల నోటీసులను బేకాతలు చేస్తూ అక్రమ షెడ్లు నిర్మాణం జరుగుతుంది. అక్రమంగా జరుగుతున్న జిహెచ్ఎంసి అధికారులు మౌనం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిబంధనలకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న జిహెచ్ఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. ఇంకా జరుగుతున్న అధికారులు మౌనం వహించడం పట్ల స్థానిక ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి పలు పత్రికలో కథనాలు వచ్చిన జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోకపోవడం జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే అక్రమ షెడ్లను పూర్తిగా తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.