సర్కారు వైద్యం...కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఇదేనా..?? అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగే వారే లేరు సమయపాలన పాటించని వైద్య సిబ్బంది..పేరుకే 30 పడకల ద
అక్షరవిజేత వీపనగండ్ల:
అంతా మా ఇష్టం...! మమ్మల్ని అడిగే వారే లేరు... అనే విధంగా వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి 30 పడకల దావఖానలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బంది పరిస్థితి ఆ విధంగా నెలకొన్నది.సమయపాలన పాటించకపోవడంతో దావఖానకు వచ్చే రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.24 గంటలు విధులు చేయాల్సినటువంటి వైద్య సిబ్బంది ఇష్టం వచ్చిన తీరుగా ఉదయాన్నే ఎవరికి నచ్చినట్లు వాళ్లు వెళ్ళిపోతున్నారు. విధుల్లో 24 గంటలు ఇద్దరు ఉండాల్సినటువంటి వైద్యులు ఒక్కొక్కరు ఉంటూ రోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండల ప్రజలు చెప్పుకొస్తున్నారు.సర్కార్ వైద్యం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు పరచడంలో ఆసుపత్రి సిబ్బంది నీరుగారుస్తున్నారు.పేదలకు ఎల్లప్పుడూ సరైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల కేంద్రాలలో 30 పడకల దావఖానాలు మరియు 100 పడకల దావఖానాలను ఏర్పాటు చేస్తుంది.కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పేదలు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రోగులకు స్టాఫ్ నర్స్ లు వైద్యం చేయకుండా అందులో పని చేసినటువంటి కార్మికులతో సెలాన్ బాటిల్లు, ఇంజక్షన్లు వారితో చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా వైద్య సిబ్బంది విధులకు రాకుండానే విధుల్లో పనిచేస్తున్న వారితో హాజరు వేయించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి వెన్నుపోటు దారులుగా తరస్థాయికి చేరుతున్నారు.ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లనే కిందిస్థాయి వైద్య సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చిన సమయానికి వెళుతున్నారని మండల ప్రజలు చెప్పుకొస్తున్నారు. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి 30 పడకల దావకానను పర్యవేక్షించాలని మండల ప్రజలు కోరుతున్నారు.