మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి ని కలిసిన సమాచార హక్కు రక్షణ చట్టం - 2005 జిల్లా సభ్యులు*
అక్షరవిజేత ,మక్తల్ :
నారాయణ పేట్ జిల్లా నుండి గతం లో సమాచార హక్కు రక్షణ చట్టం - 2005 ఎన్జీవో సొసైటీలో నారాయణపేట జిల్లా పొలిటికల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించి ఎన్నో కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అనతి కాలంలోనే మక్తల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో మర్యాద పూర్వకంగా డా :వాకిటి శ్రీహరి ని కలిసి పూలమోక్కతో సన్మానిచడం జరిగినది. ఇట్టి కార్యక్రమములో సమాచార హక్కు రక్షణ చట్టం - 2005 రాష్ట్ర మహిళా కన్వీనర్ సంద కోటి హాజమ్మ, నారాయణ పేట్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ జి. నారాయణ.,నారాయణ పేట్ డివిజన్ ఇంచార్జి దిలీప్ కుమార్,ఇస్మాయిల్ మక్తల్ మండల అధ్యక్షులు, శ్రీనివాస్ రావు, శంకర్ లింగం, శేఖర్ మగనూరు మం, అధ్యక్షులు, బలరాం కృష్ణ మం :బాద్యులు లింగన్న,కార్యకర్తలు తదితరులు పాల్గొనినారు.