కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్...*
అక్షరవిజేత,కాప్రా :
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని ఈసీఐఎల్ సిఐటియుసి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచ్చే 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేసి కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కమలానగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయం భవనంలో సీఐటీయూ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీఐటీయూ ప్రధాన కార్యదర్శి జే.చంద్రశేఖర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎర్ర అశోక్, ఏఐటీయూసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ రావులు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని, ఈ కోడ్స్ కార్మికులకు తీవ్ర నష్టం చేస్తున్నదని, ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందన్నారు. 10 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన దేశ వ్యాపిత సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు మరియు స్థానిక కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ లు పిలుపునిచ్చాయని తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ముందు 1. నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి. 2. కనీస వేతనం నెలకు రూ.26,000 లుగా నిర్ణయించాలి. 3. ఔట్ సోర్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్, అప్రెంటిస్, ట్రైనీలు వంటి వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులు ఎవరినీ క్యాజువలైజ్ చేయరాదు. 4. సమాన పనికి సమాన వేతనం. 5. నెలకు కనీస పెన్షన్ రూ.9000 ఇవ్వాలి. 6. పెన్షన్ తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలి. 07. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. 08. దరఖాస్తు పెట్టినప్పటి నుండి 45 రోజుల వ్యవధిలో కార్మిక సంఘాల తప్పనిసరి రిజిస్టర్ చేయాలి. 09. ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మందులు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు మరియు యంత్రాలు వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ పై సెంట్రల్ ఎక్సైజ్ పన్నును గణనీయంగా తగ్గించాలి. ఆహార భద్రత చట్టానికి హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రిక చేయాలి లాంటి మొత్తం 20 డిమాండ్లను నెరవేర్చి వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో పాల్గొన్నవారు.జే.చంద్రశేఖర్, రాష్ట్ర సీఐటీయూ కార్యదర్శి.ఎర్ర అశోక్,మేడ్చల్మల్కాజిగిరిజిల్లాసీఐటీయూఅధ్యక్షుడు శంకర రావు, ఏఐటీయూసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు.