చర్లపల్లి లోని సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన జెడ్ సి
అక్షరవిజేత,కాప్రా /చర్లపల్లి :
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి డివిజన్లోని సమస్యల గురించి ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ ( ఐఏఎస్ ) నీ మర్యాద పూర్వకంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి చర్లపల్లి డివిజన్ లో పర్యటించినప్పుడు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అలాగే వర్షాకాలాన్నీ దృష్టిలో ఉంచుకొని వివిధ కాలనీ లో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ త్వరలోనే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ పాల్గొన్నారు.