నేలకొండపల్లిలో విచ్చలవిడిగా విగ్రహాల ఆవిష్కరణలు,మొన్న పొట్టి శ్రీరాములు... త్వరలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
అక్షరవిజేత,నేలకొండపల్లి :
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలోని మహనీయులకు దక్కని గౌవరం.. మత్తునిద్రలో అధికారులు నేలకొండపల్లి, మండలంలో విచ్చలవిడిగా ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాలు వెలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నేలకొండపల్లి లో ఎలాంటి అనుమతులు లేకుండా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరో కొన్ని రోజులలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిద్రపోతున్నట్టు వ్యవహరిస్తున్నారు. అదే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పశువుల ఆసుపత్రి కార్యాలయాల్లో మూలన పడేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోలు లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం అలాంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహం పశువుల ఆసుపత్రిలో చేయి విరిగి ములన పడేశారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కాపాడాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విగ్రహాలు ఏర్పాటు చేసే విగ్రహాల నుండి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.