ఏసీబీ వలలో పట్టుబడ్డ విద్యుత్ శాఖ అధికారి*
అక్షరవిజేత,మహబూబాబాద్ :
రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు.ఒక్కొక్కరిగా ట్రాప్ చేస్తూ అవినీతి తిమింగాళాలకు దడ పుట్టిస్తున్నారు.బుధవారం లంచాలకు మరిగిన అవినీతి అధికారిని ట్రాప్ చేసి పట్టుకున్నారు.అధికారులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అవినీతికి పాల్పడుతున్న విద్యుత్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు.హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు.80 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్.దీంతో నరేష్ ఇంట్లో ఎసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు.నరేష్ పట్టుబడటంతో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తు్న్నారు.లంచానికి మరిగి అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన సమాచారంతో ఇంట్లో పలు డాక్యుమెంట్లు,ఆస్తుల వివరాలను తనిఖీ చేస్తున్నారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.