మాతృమూర్తుల పేరుమీద మొక్కలు నాటిన టేక్మాల్ బీజేపీ నాయకులు*
అక్షరవిజేత,టేక్మాల్ :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు టేక్మాల్ మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో తల్లి పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షులు శంకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ తల్లుల పేర్లతో మొక్కలను నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ "తల్లికి కృతజ్ఞతగా ఒక మొక్క నాటడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడమే కాకుండా తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం చూపిస్తున్నాం అని తెలిపారు.ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని తల్లుల పేరుతో ఒక మొక్క నాటి సంరక్షించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏల్లుపెట రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమ్మరి సిద్దిరాములు, జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యాక్షులు మోహన్, ఉపాధ్యాక్షులు వడ్డె రాములు, ఉపాధ్యాక్షులు వినోద్ కుమార్,పట్లోల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.