విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కృష్ణ ఎస్ ఐ ఎస్ ఏం నవీద్*
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కృష్ణ ఎస్ ఐ ఎస్ ఏం నవీద్*
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీస్ ఆదేశాల మేరకు
అక్షర విజేత కృష్ణ
మాదకద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కృష్ణా ఎస్ ఐ ఎస్ ఏం నవీద్ తెలియజేశారు మంగళవారం రోజు కృష్ణ మండలంలోని గుడెబల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి డ్రగ్స్ ,గంజాయి వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని మొక్కలు నాటడం వల్ల మనకు మంచి ఆక్సిజన్ తో ఆరోగ్యం వస్తుందని అలాగే మత్తు పదార్థాల వల్ల జీవితాలు చిత్తవుతాయని, కావున మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు కొద్ది కొద్దిగా అలవాటయితే ఆది ఒక వ్యసనంగా మారి నేర ప్రవృత్తికి దారితీస్తాయని తెలిపారు. కావున విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని కోరారు. అలాగే విద్యార్థులు యువకులు తమ చుట్టుపక్కల ఉన్న వారూ ఎవరైనా మత్తు పదార్థాలు గంజాయి డ్రగ్స్ వంటివి సేవిస్తున్నట్టు తెలిస్తే వెంటనే 1908 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కృష్ణ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.