ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన అక్కి శ్రీనివాస్ గౌడ్
అక్షర విజేత పెబ్బేర్
పెబ్బేరు మున్సిపాలిటీలోని పదో వార్డులో నాయిని సునీత నాయిని రాధాకృష్ణ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శనివారం వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు.ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారులు ఇండ్ల నిర్మాణం పనులను ప్రారంభించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నాయకులు చాకలి నరసింహ,పెద్ద రాముడు తదితరులు పాల్గొన్నారు.