పద్మారావ్ నగర్ అభివృద్ధి చేస్తా - కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి
అక్షర విజేత కాప్రా :
మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి డివిజన్ పరిధిలోని పద్మారావ్ నగర్ కాలనీలో కాలనీ వాసులు, అధికారులతో పర్యటించారు.ఈ సందర్బంగా స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ - కాలనీ పర్యటనలో పద్మారావ్ నగర్ కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన అంతర్గత రోడ్లు, పార్కుల అభివృద్ధి మరియు శానిటేషన్ పనులను చేయిస్తానని హామీయిచ్చామన్నారు.
డివిజన్ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ సందర్బంగా పద్మారావ్ నగర్ కాలనీ రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి - కాప్రా ఏ ఈ సూరజ్ , డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగ శేషు , మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఏఎంసి డైరెక్టర్ పూర్ణయాదవ్ , మాజీ డైరెక్టర్ కొబ్బనూరి నాగరాజు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, రిజ్వాన్ ఖాన్, రాకేష్ యాదవ్,శ్రీధర్ రెడ్డి, జి సత్యనారాయణ, పి నరేందర్ గౌడ్,వినోద్, ఆకుల సంతోష్, సోంనాథ్, షాబుద్ధిన్, మూర్తజా, ప్రదీప్, సిద్దిక్, రాజన్ తదితరులు మరియు పద్మారావు నగర్ కాలనీ అధ్యక్షులు రామకృష్ణ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్ రావ్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.