అనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు. అనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు జాబితా నుంచి తొలగించాలి.
అక్షరవిజేత,వనపర్తి ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల జాబితా అర్హులకు కాకుండా కోటీశ్వరులు అయిన రాజకీయ నాయకులకు కౌన్సిలర్లకు అనర్హులకు ఇండ్లు కేటాయించి ప్రొసీడింగ్ ఇచ్చారని ఐక్య వేదిక సభ్యులు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 150 మందికి అనర్హులకు అందిన ఇందిరమ్మ ఇండ్లు. కేటాయించడం కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు అనర్హులకు వెంటనే జాబితా నుంచి తొలగించాలని వారు అన్నారు ఇందుకు సంబంధించిన అధికారులకు నాయకులను బాధ్యతలుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదవారి కొరకు ప్రవేశపెట్టారని అక్రమాలకు కోసం కాదు అక్కడ పక్ష నాయకులు సతీష్ యాదవ్ అన్నారు ఇలాంటి తప్పులు జాబితాను పేదలకు కాకుండా పెద్దలకు సహకరిస్తున్న ఎవరైనా సరే చర్యలు తప్పవని ఎవరని చెప్పిన పేదల కొరకు ఐక్యవేదిక నిరంతర పోరాటాలు చేస్తుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు యాదయ్య శంకర్ సతీష్ రామస్వామి కురుమూర్తి రాము శ్రీను నాగరాజు తదితరులు పాల్గొన్నారు