ప్రభుత్వం చేపట్టిన వంద రోజులు యాక్షన్ ప్లాన్ బేస్ కాంగ్రెస్ నేతలు* *ఇల్లందులపాడులో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం.*
అక్షరవిజేత మధిర :
మధిర మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మున్సిపాలిటీ పరిధి నాలుగవ అవార్డు ఇల్లెందులపాడులో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరిగింది.డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సూచనలతో పారిశుద్ధ్య నిర్వహణ పరమైన పనులు,మురికి కాలువలు,కాలవల్లో పుడిక, పిచ్చి మొక్కలను తొలగించారు.ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా పారిశుధ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టి వార్డులో పేరుకుపోయిన చేత,కాలవల్లో పూడిక,పిచ్చి మొక్కలు తొలగింపు వంటి కార్యక్రమాలు చేపట్టటం,ప్రభుత్వ పనితీరు బేస్ అన్నారు.వర్షాకాలం కావడంతో పరిసరాలు శుభ్రంగా లేకపోతే అంటువ్యాధులు సైతం ప్రబలే అవకాశాలు ఉన్నాయి అందుచేత ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మండల కార్యదర్శి సూర్యదేవర కోటేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామినేని రామనాథం, కాంగ్రెస్ నాయకులు కోట డేవిడ్,కె.మురళి తదితరులు పాల్గొన్నారు.