*తెలంగాణ రాష్ట్రంలో అద్వాన పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యం - బీజేపీ* --మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్..
*అక్షర విజేత, మేడ్చల్ ఘట్కేసర్*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ల కొరత పై తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఇబ్బడిముబ్బడి హామీల అమలుకు నోచుకోవడం పక్కనబెడితే ఆఖరికి ప్రభుత్వ వైద్య శాఖల్లో కుక్క కాటుకు ఇచ్చే రెబిస్ వ్యాక్సిన్లకు కూడా కొరత ఏర్పడిన అద్వాన పరిస్తితి దాపురించింది అని ఆవేదన వ్యక్తం చేసిన సుదర్శన్ రెడ్డి .నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట మరలా తెలంగాణ ప్రజల నోట వినిపిస్తున్నది.బుధవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఫార్మసీని సందర్శించి అక్కడ ఉన్న రెబిస్ వ్యాక్సిన్లకు సంబంధించిన స్టాకును పరిశీలించిన క్రమంలో దాదాపు 120 బాక్సుల ఇండెంట్ కు కేవలం 10 మాత్రమే సరఫరా చేసిన విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ,పేద ప్రజలకు జీవితాలను కాపాడే మందులు కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వం నిర్వాకం హేయనీయం అని ఆయనదుయ్యబట్టారు.ఇప్పటికైన ప్రభుత్వాధినేతలు ఈ దుస్థితిని అర్థం చేసుకొని తక్షణమే రెబిస్ వ్యాక్సిన్ల సరఫరా పెంచాలని కోరారు.