*జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో భారీగా అక్రమ నిర్మాణాలు* -- అక్రమ నిర్మాణాలపై ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న అధికారులు.. ప
*అక్షర విజేత, కాప్రా జవహర్ నగర్*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో భారీగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు జవహర్ నగర్ లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ద్వంద వైఖరిని అనుకరిస్తున్న అధికారులు. పేదల ఇళ్లను జెసిబి లతో నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్న అధికారులు అక్రమ బహుళ అంతస్తులకు పచ్చ జెండా ఊపుతూ అడ్డదారుల్లో తమ జేబులు నింపుకుంటున్నారు.గతంలో ఐఏఎస్ అధికారి గోపి ఇంచార్జ్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలపై కొరడా జులుపించారు.తర్వాత కాలంలో నాయకులతో అధికారులు కుమ్మక్కై అడ్డు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ అందినకాడికి దోచుకున్నారు.పార్టీలు ఎన్ని మారినప్పటికి కనీసం గ్రామ కంఠంలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.