ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్..* ▪️ఎస్సై గూగులోతు శ్రీదేవి
*ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్..*
▪️ఎస్సై గూగులోతు శ్రీదేవి
విజేత, తరిగొప్పుల
ప్రజల ప్రాణాల రక్షణ కోసమే పోలీసుశాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందనీ ఎస్సై గూగులోతు శ్రీదేవి అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అరైవ్.. అలైవ్ నిర్వహించి అవగాహన కల్పించారు మండలంలో రోడ్డు భద్రత పాటించడం ఎంతో అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పింగిలి జగన్మోహన్ రెడ్డి, నేతుల సత్తయ్య, పోషయ్య, బోగం శ్రీనివాస్, ఏడేల్లి రామ్ నరసింహ రెడ్డి, మచ్చ యాదగిరి , యాటెల్లి రవీందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు