ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి.* *సీనియర్ బిజెపి రాష్ట్ర నాయకులు ఇటీకాల సత్యనారాయణ రెడ్డి.*
*ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి.*
*సీనియర్ బిజెపి రాష్ట్ర నాయకులు ఇటీకాల సత్యనారాయణ రెడ్డి.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ, హైదరాబాద్, జిల్లా అందత్వ నివారణ సంస్థ, ఇటీకాల ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా సీనియర్ బిజెపి రాష్ట్ర నాయకులు ఇటీకాల సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తేదీ 07 జనవరి 2026 బుధవారం ఉదయం 9:00 గంటల నుండి 3:30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ముక్కునూరు గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని కంటి సమస్యలు ఉన్న పెద్దలు, వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించబడును, ఎంపిక చేయబడ్డ వారికి కంటిలోన అద్దం అమర్చే శస్త్ర చికిత్స, ప్రయాణ ఖర్చులు, భోజన, వసతి సౌకర్యం ఉచితంగా శంకర ఆసుపత్రి కల్పించడం జరుగుతుంది. శిబిరం వద్దకు వచ్చేవారు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ఫోన్ నెంబర్ తీసుకొని రావాల్సిందిగా తెలిపారు.