ఆరుట్ల గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.* *ఆరుట్ల గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్
*ఆరుట్ల గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.*
*ఆరుట్ల గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో సోమవారం 1వ, 2వ వార్డ్ లెనిన్ నగర్ ఎస్సీ, ఎస్టీ బస్తికి సబ్ ప్లాన్ సి.ఆర్.ఆర్ నిధుల నుండి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిన సిసి రోడ్డును గ్రామ సర్పంచ్ మనిపాటి శోభ కుమార్, ఉపసర్పంచ్ నుకం రాజు, వార్డ్ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శోభ మాట్లాడుతూ... ఆరుట్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంది శేఖర్, కొండిగారి శ్రావణ్, జగన్నాథం, మంకు మమత వినోద్, మంద మాధవి, మోహన్ రెడ్డి, పునం రాము, భాను ప్రసాద్, మాడ్గుల బాలమణి, మొర్రి పద్మ, ఎండి.ఇమ్రాన్, సాతిరి సత్యం, ఎఇ మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ చీరాల రమేష్, మాజీ ఎంపీపీ మంకు ఇంద్ర, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి, వెదిరే హనుమంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ జంగయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎండి.జానీ పాషా, గ్రామ నాయకులు కంబాలపెల్లి భాస్కర్, చిందం జంగయ్య, లాలగారి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.