అశ్రు నయనాలతో పోలీస్ కానిస్టేబుల్ అంత్ర క్రియలు
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి ;
వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని శానాయిపల్లి గ్రామానికి చెందిన ఎత్తపు ఆంజనేయులు పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందాడు. దీంతో మృతుని స్వగ్రామమైన శానాయిపళ్లిలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. మృతునిది సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబమైన కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన సంవత్సర అనంతరం కుటుంబ పెద్ద అయిన తండ్రి బాలకిష్టయ్య గుండెపోటుతో అకాల మృతి చెందా డని. సంవత్సర కాలానంతరం మమతతో వివాహం జరగగా నేడు మృతుడు ఆంజనేయులు మృతి చెందడం తో కుటుంబం దిక్కులేనిది అయ్యిందని గ్రామస్తులు విలపిస్తూ తెలిపారు. మృతునికి తల్లి పోచమ్మ భార్య మమతలు ఉన్నారు.శనివారం మృతుని అంత్యక్రియలు శానాయిపల్లి గ్రామంలో నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ పెద్దకొత్తపల్లి ఎస్ఐ ల ఆధ్వర్యంలో పోలీస్ లాంచనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.