*అయ్యప్ప మాల దీక్షలో కుల వివక్ష, కన్నీళ్లు పెట్టుకున్న స్వాములు.* *గుడి బయట పూజలు చేస్తున్న స్వాములు.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
రాయపోలు గ్రామంలో అయ్యప్ప మాల దీక్షలో కులవ్యక్ష చూపిస్తూ ఆలయానికి తాళం వేసి ఆలయంలోకి రాకుండా చేశారని స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో అయ్యప్ప మాల ధరించిన ఒక సామాజిక వర్గాన్ని కొంతమంది స్వాములు ఆలయంలోకి రానివ్వకుండా తాళం వేశారని అయ్యప్ప మాల ధరించిన దళిత కులానికి చెందిన స్వాములు తెలిపారు. నిన్నటి నుండి చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.