*కుటుంబం సమాజానికి మూల స్తంభం* *సప్త శక్తి సంఘం కార్యక్రమంమహిళలతో ఘనంగా నిర్వహించిన* *ముఖ్య అతిథులు రాజేంద్రనగర్ డివిజన్ కార్పోరేటర్ పొడవు అర్చన జయప
*అక్షర విజేత రాజేంద్రనగర్*
సమాజంలో కుటుంబం మూల స్తంభం అని శ్రీ సరస్వతి విద్యాపీఠం రిటైర్డ్ ఆచార్యులు ఆదిమూలం పద్మా రాణి అన్నారు.శ్రీ సరస్వతి శిశు మందిర్ శివరాంపల్లి పాఠశాల యందు సప్త శక్తి సంఘం కార్యక్రమం మహిళలతో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాజేంద్రనగర్ డివిజన్ కార్పోరేటర్ పొడవు అర్చన జయప్రకాష్ , పొదుపు సంఘ మహిళా అధ్యక్షురాలు మంజుల శ్రీ సరస్వతి విద్యాపీఠం రిటైర్డ్ ఆచార్యులు ఆదిమూలం పద్మా రాణి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలుగా ఆర్. అనురాధ గవర్నమెంట్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కె. విజయలక్ష్మి ఆర్.ఎస్.ఎస్. సేవికాసమితి సభ్యులు కుటుంబ ప్రబోధన్ గురించి పర్యావరణ పరిరక్షణ అంశాలపై విస్తృతంగా ప్రసంగించారు. కుటుంబం సమాజానికి మూల స్తంభం అని మంచి కుటుంబం విలువలతో పెరిగిన వ్యక్తులే సమాజాభివృద్ధికి పునాది వేస్తారని, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా స్వీకరించు చిన్నచిన్న చర్యల ద్వారా పెద్ద మార్పు సాధ్యమవుతుందని మహిళలకు ప్రేరణ ఇచ్చారు అదేవిధంగా సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర పై ప్రసంగించారు. కుటుంబంలో స్త్రీ యొక్క పాత్ర క్షమా ,మాతృ, ధైర్య ,వివేకం ఉండాలి. అని ప్రస్తావన చేశారు. ఒక కుటుంబంలోని ఆడ మగ పిల్లల మధ్య వ్యత్యాసం లేకుండా చూడాలని బాగా చదివించి ప్రయోజకులను చేయాలని. మరియు పిల్లల ప్రవర్తన తోటి వారికి సహాయం తదితర అంశాలపై విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు కె .శ్రీనివాస్, కమిటీ సభ్యులు శ్రీ పెండ్యాల చంద్రమోహన్ ,సదాల చెంద్రారెడ్డి , గొట్టి అనిల్ , కందాడ జంగారెడ్డి,గుమ్మడి మోహన్ రెడ్డి, ఆచార్యుల బృందం పాల్గొన్నారు.