*శ్రీశ్రీశ్రీ కోదండరామ రామచంద్రస్వామి విగ్రహాల ర్యాలీ నిర్వహణ*
అక్షరవిజేత,గాంధారి
శ్రీశ్రీశ్రీకోదండరామరామచంద్రస్వామి విగ్రహాల ర్యాలీని ఈరోజు ఈరోజు గాంధారి మండల కేంద్రంలో జైశ్రీరామ్ నినాదానాలతో మారు మ్రోగడం జరిగింది. మిట్టి కార్యక్రమాన్ని 2019 సంవత్సరంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదే తంతుతో ఈరోజు మండల కేంద్ర సహాయంతో మరియు శ్రీరామ భక్తుల సహకారంతో ఐదు కోట్లతో ఆలయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాల ప్రతిష్టాపన త్వరలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారు త్వరలో తేదీని ప్రకటించబోతున్నారు. వారి ఆదేశానుసారంగా విగ్రహాలను ఈరోజు తిప్పారం తాండ గ్రామంలో చేరవేయడం జరిగింది. దానికి మండల ప్రజలు మరియు తిప్పారం తండా లబాన ప్రజల సహకారం మరువలేనిది. అని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ బాపురావు స్వామీజీ, తాన్ సింగ్, బిషయంలాల్, గంగారం, పెంటయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.