*కాప్రా డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గా బైరీ నవీన్ గౌడ్ నియామకం* -- బి ఎల్ అర్ చేతుల మీదుగా నియమత పత్రాన్ని అందుకున్న బైరి నవీన్ గౌడ్..
*అక్షర విజేత, మేడ్చల్ కాప్రా*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం లోఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమక్షం లో కాప్రా డివిజన్ కార్యకర్తలు నాయకుల అందరి అభిప్రాయం మేరకు కాప్రా డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గా బైరీ నవీన్ గౌడ్ ని శనివారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షం లో కాప్రా డివిజన్ అధ్యక్షుడు గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది.అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువ నాయకులు బైరీ నవీన్ గౌడ్ ను అభినందిస్తూ ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ నుండీ ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం బి ఎల్ ఆర్ ట్రస్ట్ ఇంచార్జీ గా సేవలను అందిస్తూ ఎల్లారెడ్డి గూడా గ్రామ సేవా సంఘం అధ్యక్షులు గా విశిస్టమైన సేవలను అందించి, రాజకీయ రంగం లో అనుభవం ఉన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి నవీన్ గౌడ్ అని బి ఆర్ ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షులు గా పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తన అశాభావం ను వ్యక్తం చేస్తూ నవీన్ గౌడ్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. బైరీ నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తనపై నమ్మకం ఉంచి కాప్రా డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడుగా నియమించిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ బి ఆర్ ఎస్ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కార్యకర్తలను సమన్వయ పరచుకుంటూ పార్టీ నీ బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.