అసమానతలు లేని సమాజం కోసం పోరాటం. ఎమ్మెల్సీ సత్యం.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
ఆర్థిక అసమానతలు అంతరాలు లేని సమాజం కోసం సిపిఐ పోరాడుతోందని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. ఖమ్మం లో డిసెంబర్ 26న జరగనున్న సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాల ప్రచార జాత వనపర్తికి చేరుకొంది. సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఆధ్వర్యంలోసిపిఐ కార్యాలయం నుంచి పాలిటెక్నిక్ వరకు ఎర్ర బోనాల ప్రదర్శన నిర్వహించి బస్సు జాతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ చౌక్ లో జిల్లా కార్యదర్శి విజయరాములు అధ్యక్షతన సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బిజెపి దేశ సంపదను ఆదాని అంబానీలకు కట్టబెడుతూ సమాజంలో ఆర్థిక సమాన తలను మరింత పెంచుతుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తుందన్నారు. మతపరమైన చీలిక తెచ్చి రాజకీయ లబ్ధి పొందుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. సమాజంలో అంతరాలు ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ మాట్లాడుతూ.కమ్యూనిస్టు పార్టీ ఏమిచ్చిందని కొందరు ప్రశ్నిస్తుంటారని ప్రజలకు ప్రశ్నించటం, పోరాడటం పరిష్కారం సాధించటం నేర్పింది కమ్యూనిస్టు పార్టీ యే అన్నారు. ఎవరికి కష్టం వచ్చినా, అన్యాయం జరిగిన వారి పక్షాన నిలబడి సిపిఐ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ని బలోపేతం చేయాలన్నారు. ఖమ్మంలో డిసెంబర్ 26న జరిగే వందేళ్ళ ముగింపు ఉత్సవాల్లో పార్టీ శ్రేణులు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, జె. చంద్రయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా నేత పృథ్వినాదం, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ పట్టణ కన్వీనర్ జయమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి కుతుబ్, సిపిఐ పట్టణ మాజీ సహాయ కార్యదర్శి కురుమయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరేష్, డివిజన్ కార్యదర్శి వంశి, మహిళా నేతలు శిరీష, వెంకటమ్మ, జ్యోతి, అంజనమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సిపిఐ ఎర్ర బోనాల ప్రదర్శన.
సిపిఐ జాత సందర్భంగా ఎర్ర బోనాల ప్రదర్శన వనపర్తి పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. కుండలను ఎరుపు రంగుతో అలంకరించి సుత్తె కొడవలి గుర్తులతో సింగారించి, ఎర్ర చీరలు, జెండాలు, కండువాలు ధరించిన మహిళలు సిపిఐ ఎర్ర బోనాలను నెత్తికెత్తుకొని పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ ఆఫీస్ నుంచి అంబేద్కర్ చౌక్ రాజీవ్ చౌక్ మీదుగా పాలిటెక్నిక్ వరకు ప్రదర్శన సాగింది. పట్టణ ప్రజలు ఎర్ర బోనాలను ఆసక్తిగా తిలకించారు.