*వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం* *ఏపిఏం గోపతి శ్రీనివాస్,సీసీ అనసూయ,*
అక్షర విజేత,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,గణపూర్,జంమ్గి కె,జంమ్గి బి,గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సోమవారం రైతులు గ్రామ పార్టీ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏపీఎం, సీసీ,మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనె రైతులు తాము పండించిన పంట వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనె విక్రయించాలని అన్నారు.దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.ఏ గ్రేడ్ వరి ధాన్యం ₹ 2389,బి గ్రేడ్ వరి ధాన్యం ₹ 2369,సన రకం వరి ధాన్యాన్ని ₹ 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ హన్మడ్లు,సిఏలు సవిత, సుమ దేవి,శ్రీపతి,గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై చిన్న మల్లారెడ్డి,తొమ్రే బాలప్ప,వై పెద్ద మల్లారెడ్డి,కోటగిరి మనోహర్,తట్టి వీరేశం, ప్రవీణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, పండరి నాథ్ రావు, ముల్తాని బాబూసాబ్, భాగవన్ సమీర్,వివో లీడర్లు,గంగామణి, లక్ష్మి,సావిత్రి,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.