*నాగారం సత్యనారాయణ కాలనీ మద్యం దుకాణం పై రగడ* --- ఇదే కాలనీలో పాత మద్యం దుకాణం పై ఎందుకు మౌనం??? --- భాగస్వామ్యం ఇవ్వనందుకే చంద్రారెడ్డి మద్యం దు
*అక్షర విజేత, కీసర నాగారం*
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ లో నూతన మద్యం దుకాణం ప్రభుత్వ లక్కీ డ్రా లో షాప్ 1. పవన్, జీవన్ కు వచ్చింది అని అన్నారు. ఇందులో భాగంగానే నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి స్థలం లీజుకు అడగగా రెంట్ కాకుండా,భాగస్వామ్యం అడిగారు.మేము అందుకు ఒప్పుకోనందుకు నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి కాలనీ వాసులనూ ఉసిగొల్పి కుట్రా పూరితంగా నిరసన కార్యక్రమం చేయిస్తూ, పలు విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. సత్యనారాయణ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెక్యూరిటీ గాడ్స్ ను ఏర్పాటు చేస్తామని, అలాగే ఈ మెయిన్ రోడ్డులోని సిసి కెమెరాలను కీసర పోలీస్ స్టేషన్ కు అనుసంధానం చేసి సెక్యూరిటీ కల్పిస్తామని కాలనీ వాసులుకు తెలియచెప్పడం జరిగింది.శుక్రవారం రోజు నిరసన కార్యక్రమం లో పూర్తిగా సత్యనారాయణ కాలనీ వాసులు లేకుండా కూడా రోడ్డు మీద నుంచి కొంత మంది రోజు వారి కూలీలను తీసుకొచ్చి, చంద్రారెడ్డి తన స్వార్ధ కోసం కాలనీ లో అలజడులు సృష్టించి ఈ నూతన మద్యం దుకాణం పై లేనిపోని వదంతులు కలగచేస్తున్నాడు. ఇక్కడా ఉన్నా ప్రైవేట్ పాఠశాల కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం దూరం లో ఉంది. మరియు ఇదే కాలనీ లోని రోడ్డు నెంబర్ 12 లో పాత మద్యం దుకాణం చంద్రారెడ్డి ప్లాట్ లో ఉంది. ఆ పాత మద్యం దుకాణం వెనకాల చైతన్య ప్రైవేట్ పాఠశాల కూడా ఉంది అయినా ఆనాడు ఎలాంటి అభ్యంతరం కాలనీ వాసులు తెలపలేదు. ఈ రోజు అభ్యంతరం తెలుపుతున్నారు అంటే అది కేవలం చంద్రారెడ్డి కుట్ర పూరితమే అని పవన్ రెడ్డి,జీవన్ రెడ్డి అన్నారు.ఈ కొత్త మద్యం దుకాణం అన్ని విధాల ప్రభుత్వ నియమ నిబంధనల కు అనుగుణంగా సంబంధిత శాఖ అనుమతి తో వైన్స్ షాప్ ప్రారంభం చేయబడుతుంది అని పవన్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తెలిపారు.*మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ..* సత్యనారాణ కాలనీ లో దాదాపుగా 400 పై చిలుకు కుటుంబాలు నివసిస్తున్నారు. పిల్లలకు,మహిళలకు భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దు అని నిరసన వ్యక్తం చేస్తున్నామని మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, కాలనీ వాసులు తెలిపారు.