నూతన వరుడు బుయ్యని బ్రిజేష్ రెడ్డిని వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆర్బీఓఎల్ సీఈఓ, ఎండీ దంపతుల సంతోషం
అక్షర విజేత, తాండూరు
తాండూరు కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, రాజకీయ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, బుయ్యని సరళా రెడ్డి దంపతుల కుమారుడు బుయ్యని బ్రిజేష్ రెడ్డిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదాలు అందించారు.
బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డిల కుమారుడు బ్రిజేష్ రెడ్డి వివాహా మహోత్సవ వేడుకలు అంగకరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఈ వివాహా వేడుకలకు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. కాబోయే నూతన వరుడు బ్రిజేష్ రెడ్డిని కలిసి ఆశీర్వదించారు. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. కల్వకుంట్ల కవిత బుయ్యని వారింట సందడి చేయడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.