మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మర్పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల ఘనపూర్ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్య కర్త ప్రమాద వషాత్తు మ్యాతరీ ప్రవీణ్ కుమార్ చనిపోయారు. ఇట్టి విషయాన్నీ తెలుసుకున్న మర్పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు అంత్యక్రియలకు కోసం అందజేశారు.ఘనపూర్ గ్రామ సర్పంచ్ కల్పన శంకర్ 2500 రూపాయలు అందజేశారు. ఇట్టి కార్యక్రమం శంకర్, ఎంపీటీసీ బిచ్చన్న ఆధ్వర్యంలో లో వారి ఇంటికి వెళ్లి 7500 రూపాయలు గ్రామ నాయకులు కార్య కర్తల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో పి మచ్చేందర్, ఎం సంతోష్. పి లాలయ్య, పి నరేందర్ ఎండి రహీం ఎం ప్రభాకర్ తదితులు పాల్గొన్నారు.