సమాచార హక్కు సాధన కమిటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నియోజకవర్గాలు మండలాలు గ్రామాలు కమిటీలకు ఆహ్వానం
అక్షరవిజేత,కామారెడ్డి ప్రతినిధి :
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ ఖాసిం ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం సాధన కమిటీలో నియోజకవర్గాలు మండలాలు గ్రామ కమిటీలు, ఆహ్వానం పడుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ ఖాసీం కన్వీనర్ గా సుధాం విట్టల్ తెలిపారు, అదేవిధంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ విధివిధానాలు ఎజెండా, అవినీతి అక్రమాలను వెలికి తీసి న్యాయస్థానం ద్వారా అరికట్టడం ప్రతి నిరుపేద సామాన్యులకు న్యాయ సలహాలు సేవలు అందివ్వడం ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దక్కేలా కృషి చేయడం, అన్ని విభాగాలలో ఆర్టిఏ చట్టాన్ని అమలు జరిగే వరకు చర్యలకై కృషి చేయడం, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం విద్య వైద్యంలో ఉన్న లోపాలు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ, ప్రమాణాలు మెరుగుపరుచుటకు కృషి చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడం, ప్రభుత్వ ప్రజా ఆస్తులను కాపాడడం ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూడటం అలాగే ప్రతి గ్రామాలలో రెవెన్యూ ,అటవీ, చెరువు, శిఖాలు ,బంచరాయి, బంజరు,పోరంపోకు, గ్రామకంఠ ,భూముల లెక్క తేల్చడానికి ,అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం, లీగల్, ప్రొసీజర్ ,తో పనిచేయడం ఈ యొక్క సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కృషి చేస్తుందని తెలపడం జరిగింది. ఈ యొక్క సమాచార హక్కు చట్టం సాధన కమిటీ లో బాగా స్వాములు కావాలనుకున్నవారు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించగలరు, 9490505150 9704872972 9951209106 మనవి.