పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ ముందు ధర్నా ---తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజాద్ పాషా.
అక్షరవిజేత ములుగు ప్రతినిధి:
ములుగు జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జంగాలపల్లి బ్రాంచ్ ముందు పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని. రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించాలని. తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం స్థానిక మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజాద్ భాష ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ములుగు జిల్లాలోని ఎస్బిఐ కెనరా బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్. మాదిరిగా పంట రుణాలను రీ షెడ్యూల్ చేయాలని. రైతులకు రైతు భరోసా డబ్బులు చెల్లించాలని. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పంట రుణాలు ఇవ్వాలని. బ్యాంక్ అధికారులను డిమాండ్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా చేయాలని. పహాని నక్కల ఆధారంగా తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయాలని రైతులకు బంగారం తాకట్టు పైన పంట రుణాలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రిజర్వు బ్యాంకును డిమాండ్ చేసినారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సమరశీల పోరాటాలు ఎల్లప్పుడూ చేస్తుందని ఆయా ప్రభుత్వాల ను హెచ్చరించారు. వంట రుణాల మాఫీ కోసం. పంట రుణాలరీ షెడ్యూల్ కోసం సమరశీల పోరాటాలు చేస్తామని బ్యాంక్ అధికారుల ను హెచ్చరించారు. ఈ ధర్నా వినతిపత్రం కార్యక్రమంలో. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు జంగాలపల్లి మాజీ సర్పంచ్ ఎన్ శ్రీధర్, రెంటాల బిక్షపతి, మంకిడి కృష్ణయ్య, కల్తి తిరుపతి, శవాల సంపత్ , వి వెంకట్రాం, ఎండి అలీ పాషా. సాంబయ్య. గొంది కాంత్ అక్క. శంకర్. కుమారస్వామి. సమ్మయ్య. మల్లయ్య. తదితరులు 80 మంది వరకు పాల్గొన్నారు.