ద్వారకాతిరుమలలో భక్తుల విశ్వాసం పై దాడి ఆలయంలో నిలువు దోపిడీ
అక్షరవిజేత, ద్వారకాతిరుమల :
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సి ఆర్ వో ఆఫీస్ చేతివాటం ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కి నిత్యం వేలాది భక్తులు దర్శనార్థం వస్తున్నారు స్వామివారిని భక్తిశ్రద్ధలతో మొక్కుకుంట కొండపై పెళ్లిళ్లు జరిపించుకోవడం అనేక కుటుంబాలు సెంటిమెంటుగా మారింది అయితే ఇటీవల ఆలయ పరిధిలోని సి ఆర్ ఓ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ముందుగానే మండపాలు బుక్ చేసుకున్న భక్తులను పక్కనపెట్టి భారీ మొత్తం చెల్లించే వారికి కేటాయింపు జరుగుతుంది ఇది పూర్తిగా అన్యాయమైంది భక్తులకి పారదర్శకంగా సేవలు అందించాల్సిన దేవస్థానం కొందరి వ్యక్తిగత లాభాలు కోసం నడుస్తుంది అన్న అనుమానాలు పెరుగుతున్నాయి ఈ దోపిడీపై ప్రశ్నిస్తే సిబ్బంది సమాధానం ఇవ్వడం లేదు పై అధికారులకు దేవస్థానం ఈవోకు ఫిర్యాదు చేసిన స్పందన కనపడటం లేదు ఇది కేవలం నిర్వహణ లోపం మాత్రమే కాదు భక్తులు విశ్వాసంపై జరిగిన దాడి 02_05_2025 తారీఖున ఒకే తేదీలో ఒకే సమయానికి ఒకటే మండపం ఇద్దరికీ బుక్ చేసిన పిఆర్ఓ ఆఫీస్ సిబ్బంది 59,000 మండపం పదులు లక్ష 8 వేలు మండపాన్ని భక్తుడికి ఇచ్చారు .మండపాలు బుకింగ్ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి .ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు న్యాయం జరగాలి .అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలి.భక్తుల ఫిర్యాదులకి తక్షణ స్పందన ఇచ్చే కమిటీ ఏర్పాటు చేయాలి .భక్తుల శ్రద్దను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని అధికారులపై నమ్మకం ఉంచుతున్న లేకపోతే భక్తులే స్వరాన్ని మారుస్తారు ఇట్లు భక్తులు