తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య పోరాడిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం
అక్షర విజేత:రఘునాథపల్లి :
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం,భూక్తి కోసం,వెట్టిచాకిరీ విముక్తి కోసం అతిపిన్న వయసులో నిజాం నిరంకుశ పాలనకు ఎదురోడ్డి పోరాడి తొలి అమరుడైన కమ్యూనిస్టు యోధుడు దొడ్డి కొమురయ్య పోరాటం అందరికి స్ఫూర్తి దాయకమణి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కావటి యాదగిరి అన్నారు. దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని కంచనపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి పసుల దానియల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కాబట్టి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..... నిజాం కాలం నుండి,నేటి పాలకుల్లో ఇంతవరకు మార్పు రాకపోవడం పట్ల దొడ్డి కొముర య్య స్ఫూర్తితో ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిదంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో,కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి కందుకూరి మల్లేశం, నాయకులు మడి కంటి సోమయ్య, అంజయ్య,గుండ్ల మురళి, పసుల దానియేలు, గుండె సుధాకర్, గొంగళ్ళ వెంకటయ్య, గొంగళ్ల మహేందర్, నాల్కపల్లి దయాకర్, సుద్దాల శ్రీకాంత్, గొంగళ్ళ కిషోర్,వేల్పుల ప్రవీణ్, చేపూరి దయాకర్, యోసేబు, డేవిడ్,లావణ్య, మేరమ్మ, అనిత,నర్సమ్మ,రేణుక తదితరులు పాల్గొన్నారు.