అంగన్వాడి కేంద్రాలలో అక్షరాభ్యాస కార్యక్రమం
అక్షరవిజేత,నర్సింహులపేట /చిన్నగూడూరు :
ప్రతినెల మొదటి మరియు చివరి శుక్రవారం లో నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా సిడిపిఓ ఎల్లమ్మ మరియు సూపర్వైజర్ల శ్రీలత ఆదేశాల మేరకు చిన్న గూడూరు సెక్టార్ మరిపెడ ప్రాజెక్టు కు సంబంధించి సి బి ఈ ఈవెంట్ లో భాగంగా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామంలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో జయారం గ్రామానికి సంబంధించి నాలుగు అంగన్వాడి సెంటర్ల టీచర్లు వెంకటరత్నం, ఎల్లమ్మ, స్వరూప ల యొక్క అంగన్వాడి సెంటర్లను సమిష్టిగా చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ చిన్నపిల్లల అందరిని కూడా గ్రామ ప్రజలు తల్లులు అందరూ కూడా పిల్లలకు పౌష్టిక ఆహార లోపం లేకుండా ఉండటానికి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపాలని తల్లులకు కోరడం జరిగింది. తర్వాత ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు మదర్స్ కమిటీ సభ్యులు, ప్రి స్కూల్ పిల్లల తల్లులు,గర్భిణీలు,బాలింతలు తదితరులు పాల్గొన్నారు.