సమరానికి సై అంటున్న ఉమ్మడి గోపాల్పేట్.! ==నామినేషన్ లిస్టులో సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులలో గోపాల్పేట్ నెంబర్ వన్ స్థానం ==ఉమ్మడి గోపాల్పేట్
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా ఉమ్మడి గోపాల్పేట్ మండల పరిధిలోని మూడు మండలాలలో గోపాల్ పేట్ మండలం ముందు స్థానంలో మొదటి రోజు నామినేషన్లను స్వీకరించింది. రెండో స్థానంలో రేవల్లి మూడో స్థానంలో ఏదుల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు జరిగింది. పూర్తి వివరాల ప్రకారం గోపాల్పేట్ మండలానికి సంబంధించి 13 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 10 మంది వార్డ్ మెంబర్లుగా నామినేషన్లు వేయడం జరిగింది, రేవల్లి మండలానికి సంబంధించి 12 మంది సర్పంచి అభ్యర్థులుగా, 8 మంది వార్డ్ నెంబర్లుగా నామినేషన్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఏదుల మండలానికి సంబంధించి ఆరు మంది సర్పంచి అభ్యర్థులుగా, 1 వార్డ్ మెంబర్ గా నామినేషన్లు వేశారు. మొత్తం ఉమ్మడి గోపాల్పేట్ మండల వ్యాప్తంగా మొదటిరోజు 31 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తే 19 మంది వార్డ్ మెంబర్లుగా వేయడం జరిగింది. ఎక్కువ శాతం గోపాల్పేట మండలం సంబంధించిన అభ్యర్థులే మొదటి రోజు ఎక్కువ నామినేషన్లు దాఖలు చేయడం ఉమ్మడి గోపాల్పేట్ మండలంలో రాజకీయం చర్చనీయంగా మారింది.