పట్నం నుండి పల్లెల వరకు బిజెపి జెండా.... చాపకింది నీరులా బిజెపి... స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు కైవశానికి యత్నం....
వరంగల్ జిల్లా, నవంబర్24 ( అక్షర విజేత)
ప్రతినిధి :
వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో నర్సంపేట నియోజకవర్గంలో బిజెపి ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో పార్టీలో పనిచేసిన కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కొరకు ఊరూర జండా గద్దేలు నిర్మించి, పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలు గా పోటీ చేసి గణనీయమైన ఫలితాలు సాధించారు. జాతీయ నాయకులు గౌ. శ్రీ. వెంకయ్య నాయుడు ని నర్సంపేటకు అహ్హనించి, బహిరంగ సభ నిర్వహించి అప్పటి పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి పార్టీ సత్తా చాటింది. కాలక్రమేణ కేంద్రంలో పార్టీ అధికారం కోల్పోవడం, జిల్లాలో నాయకత్వ లోపం, నియోజకవర్గంలో వలస నాయకుల వలన పార్టీ నిస్తేజంలోకి వెళ్ళింది. పార్టీలో చేరిన కొందరూ నాయకులు కూడా పార్టీని అభివృద్ధి చేయకుండా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావించి ఇతర పార్టీలో చేరి బీజేపీ నీ కోల్కో లేని విధంగా దెబ్బ తీశారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 2018 -1200 ఓట్లు, 2023- 3000 ఓట్లు సాధించి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. తదనంతరం సంస్థాగత నిర్మాణంలో భాగంగా వరంగల్ జిల్లా అధ్యక్షులుగా గంట రవికుమార్ ఎన్నికైనా తర్వాత నియోజకవర్గంలోనీ యువ నాయకుడు గూగుల రాణా ప్రతాప్ రెడ్డి నీ ప్రోత్సహించి పార్లమెంట్ ఎన్నికలలో 24000 వేల ఓట్లు సాధించి పట్టు నిలుపుకున్నారు. అదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం సాధించాలంటే.. పార్టీ నిర్మాణం బలంగా ఉండాలని భావించి ఓ మండలానికి చెందిన సీనియర్ నాయకుడిని పురమాయించినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షుడి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆ నాయకుడు RSS ముఖ్యుల సలహాలు తీసుకుంటూ బిజెపి నుండి ఇతర పార్టీల లోకి వెళ్లిన వారిని తనకున్న పరిచయాలతో, వారితో టచ్ లోకి వెళ్లి రహాస్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే అవకాశాలు వస్తాయని, వచ్చే ప్రభుత్వం బిజెపిదే అని, 12 సంవత్సరాలనుండి అవినీతి మచ్చ లేకుండా సుపరిపాలన అందిస్తున్న మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలో చేరాలని కోరుచున్నట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తాయని.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులకు, ప్రజలకు వివరిస్తూ.. వివిధ వర్గాల ప్రజలను పార్టీకి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారని, నియోజకవర్గంలోని నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నర్సంపేట పట్టణం, నుండి జిల్లా అధ్యక్షుల సారధ్యంలో.. యువ నాయకుడి నాయకత్వంలో ఎవరు ఊహించని విధంగా భారీ చేరికలు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు కైవసం చేసుకుని అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టించేలా ప్రణాళిక రూపొందిస్తునట్టు సమాచారం.