*రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై వ్యక్తి మృతి.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించాడు. సోమవారం సాయంత్రం 4:45 గంటలకు బొమ్మ రాజు తండ్రి లింగం 35 సంవత్సరాలు, ఎంపీ పటేల్ గూడ చెందిన వ్యక్తి ఇబ్రహీంపట్నం నుండి ఎంపీ పటేల్ గూడకు తన ఇంటికి సైకిల్ పై వెళుతుండగా, మంగళ్ పల్లి కల్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలోకి చేరుకున్నప్పుడు, అతను అతివేగంగా వాహనాన్ని నడపడం వల్ల మెయిన్ రోడ్డుపై పడిపోయాడు, దాని కారణంగా తలకు గాయమై అక్కడికక్కడే మరణించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ హెచ్ ఓ తెలిపారు.